Navodaya Notification: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే లాస్ట్

Navodaya Vidyalaya Entrance Test: ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. విద్యార్థులు ఎలా దరఖాస్తు చేయాలి..? ఎవరు అర్హులు..? ఎప్పటిలోగా అప్లై చేయాలి..? పూర్తి వివరాలు ఇవిగో..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 06:09 AM IST
Navodaya Notification: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే లాస్ట్

Navodaya Vidyalaya Entrance Test: నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారిక వెబ్‌సైట్‌ https://navodaya.gov.in/nvs/en/Home1/ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఆప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 29వ తేదీన ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సినవి..

  • విద్యార్థులు నిర్ణీత ఫార్మాట్‌లో తమ వివరాలను పేర్కొంటూ స్కూల్ హెడ్ మాస్టర ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాలి.
  • విద్యార్థి ఫొటో, విద్యార్థి, తల్లిదండ్రుల సంతకాలు చేసి స్కాన్ చేయాలి.
  • ఆధార్‌ వివరాలు/రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్ చేయాలి.
  • జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసం ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలి.
  • జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌/గుర్తింపు పొందిన స్కూల్‌లో 2022-23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వారు అర్హులు.
  • విద్యార్థి మే 1, 2011 నుంచి ఏప్రిల్ 30, 2013 మధ్య జన్మించి ఉండాలి.

https://navodaya.gov.in/nvs/en/Home1/ లింక్ క్లిక్ చేయగానే నవోదయ విద్యాలయ సమితికి చెందిన నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇందులో మీరు కొన్ని బేసిక్ వివరాలు మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తరువాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి. ఈ నెల 31వ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

Also Read: SC Demonetisation Judgement: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Also Read: Demonetisation: నోట్ల రద్దు చట్ట విరుద్ధమే, ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించలేదు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News