Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..

Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 1, 2024, 08:18 AM IST
Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..

Nagarjuna Sagar: కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లోని  ప్రాజెక్టుల్లో కురుస్తోన్న వర్షాలకు  కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.  శ్రీశైలం ప్రాజెక్ టునుంచి  నాగార్జున సాగర్‌ దిశగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలంలోని 10 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు శ్రీశైలంలోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

దీంతో దిగువకు 56 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ఒదిలారు. దీంతో  నాగార్జున సాగర్‌లో క్రమంగా  నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. 312.05 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తు తం 161.97 టీఎంసీల నీరు ఉంది. కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ దాదాపు గా నిండాయి.శ్రీశైలం గేట్లు ఎత్తడంతో కృష్ణా ప్రవహించే పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.  అంతేకాదు అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరో వారం రోజులు పాటు ఈ ప్రవాహం కొనసాగితే.. నాగార్జున సాగర్ పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో వారం రోజులు పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురయనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News