Nagababu as AP Cabinet Minister: మెగా ఫ్యామిలీలో చిరంజీవి హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు హీరోగా మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో తన నట వారసుడిగా రాక్షసుడు సినిమాతో నాగబాబును నటుడిగా పరిచయం చేసారు. ఆ తర్వాత ఈయన హీరోగా పలు చిత్రాల్లో నటించినా.. పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అక్కడ నాగబాబుకు తీవ్ర నిరాశే ఎదురైంది. నిర్మాతగా అన్నయ్యతో తెరకెక్కించిన ‘రుద్రవీణ’, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, స్టాలిన్ చిత్రాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఒక్క బావగారూ.. బాగున్నారా సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.
అటు తమ్ముడు పవన్ కళ్యాణ్ తో నిర్మాతగా చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘ఆరెంజ్’ సినిమాలు నిర్మాతగా నాగబాబును తీవ్రంగా కృంగదీసాయి. అటు నిర్మాతగా విరామం ప్రకటించారు. అంతేకాదు 2008లో అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అండగా నిలిచారు.
ఆ తర్వాత 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ.. 18 సీట్లతో పాటు 18 శాతం ఓట్లను తెచ్చుకోగలిగింది. ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీ చిరును రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చిరంజీవి.. పర్యాటక శాఖ మంత్రిగా స్వతంత్య్ర హోదాలో పనిచేసారు.
కట్ చేస్తే.. 2024లో పవన్ కళ్యాణ్.. రెండోసారి ఎమ్మెల్యేగా బరిలో దిగి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారు. అటు చంద్రబాబు మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సోదరుడు నాగబాబు చంద్రబాబు క్యాబినెట్ లోకి చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తెలిపారు. ఈ రకంగా ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా పనిచేయడం అనేది బహుశా ఓ రికార్డు అని చెప్పొచ్చు. మన దేశంలో ఏ ఫ్యామిలీకి చెందిన హీరోలు ముగ్గురు మంత్రులైన దాఖలాలు లేవు. ఒక రకంగా ఇది మన దేశంలోనే మెగా ఫ్యామిలీకి దక్కిన అరుదైన రికార్డు అని మెగాభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇక నాగబాబు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్‌లోకి ఎంట్రీ వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ MPగా పంపేందుకు అవకాశం వున్నా ఆయన్ను రాష్ట్రానికే పరిమితం చేశారు. దీనికి వెనుక పవన్ కల్యాణ్ వేసిన ప్లాన్ ఏంటి? నాగబాబు ఎంట్రీతో రాష్ట్రంలో జనసేన బలపడటం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.