Mohan Babu: మోహన్‌‌బాబు యూనివర్సీటికి మంచు మనోజ్..?.. ఎంబీయూ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు..

mohan babu vs Manchu manoj: మోహన్ బాబు యూనివర్సీటికి మంచు మనోజ్ వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు భారీ ఎత్తున ఎంబీయూ యూనీవర్సీటీకి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిత్త వాతావరణం నెలకొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 15, 2025, 02:21 PM IST
  • ఎంబీయూ యూనీవర్సీటీ వద్ద హైటెన్షన్..
  • భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు..
Mohan Babu: మోహన్‌‌బాబు యూనివర్సీటికి మంచు మనోజ్..?.. ఎంబీయూ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు..

Police depoloyed at mohan babu university: మోహన్ బాబు ఇటీవల తన కొడుకు విష్ణుతో కలిసి తిరుపతిలోని మోహన్ బాబు యూనిర్సీటీలో సంక్రాంతి వేడుకల్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సీటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని గతంగతం.. అంటూ.. కూడా మాట్లాడారు. ఈ క్రమంలో సంక్రాంతి వేడుకల్ని మాత్రం గ్రాండ్ గా జరుపుకున్నారు.

 

ఈ క్రమంలో మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని ఒక అనాథశ్రమం నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మంచు కుటుంబంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. దీనిపై మంచు విష్ణు ఇన్ స్టాలో పోస్ట్ సైతం చేశారు. ఏడాది క్రితమే తాను.. 120 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయం చూసి మరింత మంది ఇన్ స్పైర్ అవుతారని.. తాను.. చెబుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. మంచు మోహన్ బాబు యూనీవర్సీటికి మంచు మనోజ్ వస్తున్నారని వార్త ఒక్కసారిగా హైటెన్షన్ గా మారింది.

ప్రస్తుతం మోహన్ బాబు గొడవలు వార్తలలో లేకుండా.. కూల్ గా అయిపోయారు. ఈ క్రమంలో సంక్రాంతి వేడుకలు కూడా విద్యార్థులతో గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి.. తిరుపతికి వచ్చారు. అక్కడి నుంచి మంచు మనోజ్ తన బంధువుల ఇంటికి వెళ్లి.. మోహన్ బాబు యూని వర్సీటికి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. 

Read more: Naga Chaitanya - Sobhita: ఈ సంక్రాంతి శోభిత, నాగ చైతన్య దంపతులకు వెరీ వెరీ స్పెషల్.. పెళ్లి తర్వాత తొలి పండగ..

ఇప్పటికే మంచు మనోజ్ ఎంబీయూ యూనివర్సీటీకి వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ప్రస్తుతం ఎంబీయూ యూనీ వర్సీటీ వస్తున్నారని సమాచారంలో.. భారీ ఎత్తున పోలీసులు ఎంబీయూ యూనీవర్సీటీకి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి గొడవలు జరక్కుండా ముందు జాగ్రత్తగా బందోబస్తు చేపట్టినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News