Chandrababu Naidu Sent to Judicial Remand: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో టీడీపీ శ్రేణులు నిరాశలో కురుకుపోయారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. మరోవైపు వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చుతూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంపై మంత్రి రోజా ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆమె.. తన నివాసం వద్ద టపాసులు కాల్చారు. స్వీట్లు పంచారు. 'బాబు చేసిన తప్పులకు ఎప్పుడో అరెస్ట్ అయ్యుండాలి. భగవంతుడు ఇప్పుడు టైమ్ ఎందుకు డిసైడ్ చేశాడంటే.. ఇదే వయసులో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన మీద చెప్పులు వేయించి చావుకు కారణమయ్యాడు' అని మండిపడ్డారు.
స్కిల్ స్కామ్ రూపకర్త చంద్రబాబు అని.. అన్ని ఆధారాలతోనే సీఐడీ ఆయనను అరెస్ట్ చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు చేసిన నేరానికి తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల బాబు జీవితమంతా అవినీతిమయమని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరూ అవినీతి చేయొద్దనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తనను ఎవరు ఏం చేయలేరనుకుంటున్న చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు అని.. ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తనలోని దొంగ స్కిల్స్ అన్నీ ఉపయోగించి.. స్కిల్ డెవలప్‌మెంట్ సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును జైలు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని లోకేష్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలని సూచించారు. అవినీతి ఎవరు చేసినా.. ఉక్కు పాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారని అన్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు జ్యూడిషియల్ రిమాండ్ విధించడతో చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్న విషయం ఈ రోజు అర్ధమై ఉంటుందన్నారు. చంద్రబాబు ఈ కేసు కాకుండా మరో 7 కేసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేశాడని.. ఇక ఇప్పుడు కుదరదని అన్నారు. చంద్రబాబుకు పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.
Also Read: Nara Lokesh Emotional Note: చంద్రబాబుకు నాయుడికి రిమాండ్.. కన్నీళ్లతో నారా లోకేష్ ఎమోషనల్ నోట్
Also Read: Chandrababu Case: చంద్రబాబుకు రిమాండ్, 8 గంటల వాదనలు, 13 గంటల ఉత్కంఠలో ఏం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి