YSRCP: పార్టీ పదవులకు ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై.. వైసీపీలో ఏం జరుగుతోంది..?

Ysrcp Mlas Resign to Party Posts: ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు గుడ్ బై చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతోంది..? ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు..?

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 09:46 AM IST
YSRCP: పార్టీ పదవులకు ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై.. వైసీపీలో ఏం జరుగుతోంది..?

Ysrcp Mlas Resign to Party Posts: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రచిస్తుంటే.. ఇటు ఎమ్మెల్యేల తీరు మరోవిధంగా ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే తాము పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు వారు ప్రకటించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వదులుకున్నారా..? లేదా అధిష్టానమే రాజీనామా చేయమని చెప్పిందా..? అనే చర్చ కూడా జరుగుతోంది.

గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలి పదవికి మాజీ మంత్రి మేకతోటి సుచరిత గత వారం రాజీనామా చేయగా.. తాజా అనంతపురం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఇలా వరుసగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో వైసీపీలో ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇతర కారణాలు ఏమి లేవని కార్యకర్తలకు చెబుతున్నారు. 

రాజీనామా సమయంలో మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. తాను ఇక నుంచి నియోజకవర్గానికే పరిమితం కావాలని అనుకుంటున్న విషయం అధిష్టానానికి తెలియజేశానని చెప్పారు. ప్రతిపాడులో ప్రజలకు మరింత చేరువ కావాలని.. అందుకే గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని అన్నారు. అయితే మేకతోటి రాజీనామాకు మరో కారణం ఉందంటున్నారు కొందరు. జగన్ కేబినెట్‌లో తొలి దఫా ఆమె మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఆమెకు అవకాశం కల్పించలేదు. అప్పుడు ఆమె అనుచరులు ఆందోళన కూడా చేశారు. దీంతో అప్పటి నుంచి మేకతోటి అసంతృప్తితో ఉన్నారని టాక్. జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా.. పూర్తిస్థాయిలో నిర్వహించలేదని తెలిసింది. అందుకే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు.

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామాకు మరో కారణం ఉంది. మూడు నెలల క్రితం ఆయన అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. తమ కుంటుంబంలో జరిగిన విషాద ఘటనతో తాను జిల్లా అధ్యక్ష బాధ్యతలపై దృష్టిపెట్టాలేపోతున్నానని రామచంద్రారెడ్డి చెప్పారు. తాను రాయదుర్గం నియోజకవర్గంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సీఎం జగన్‌కు తన రాజీనామా గురించి చెప్పానని.. కొత్త అధ్యక్షుడిని నియమించాలని కోరినట్లు తెలిపారు. 

Also Read: Earthquake Causes: భూకంపాలు ఎలా ఏర్పడతాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!  

Also Read: Pawan Kalyan: ఇంకా ఊడిగం  ఎవరికి చేస్తాం.. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్ధలు కొట్టక తప్పదు: పవన్ కళ్యాణ్‌   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News