Lakshmi Parvathi: 'నాతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడింది'...లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్

Lakshmi Parvathi: ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం కీలక ప్రకటన చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 04:20 PM IST
  • నేడు ఎన్టీఆర్ 26వ వర్థంతి
  • నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
  • అనంతరం షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్ సతీమణి
Lakshmi Parvathi: 'నాతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడింది'...లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్

NTR - Lakshmi Parvathi: నేడు ఎన్టీఆర్ 26వ వర్థంతి (NTR Vardhanthi). ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi) నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె తెలిపారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని.. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ (NTR Soul) 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి వెల్లడించారు.తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని.. అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని.. ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని తనతో ఎన్టీఆర్ ఆత్మ చెప్పిందన్నారు.

Also Read: Ys jagan tweet: చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి

ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఓ నమ్మకం కలిగిందని అన్నారు. ఎన్టీఆర్ (NTR) ఎప్పుడూ తెలుగు ప్రజలను విడిచిపెట్టి ఉండరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే.. మన చుట్టూ ఉంటుందన్నారు. ఈ ఘాట్‌ దగ్గరని కాదు కానీ… తెలుగు రాష్ట్రాల ప్రజలందరి వద్ద ఆయన ఆత్మ తిరుగుతూ..  బాగోగులు చూసుకుంటోందని అన్నారు.

ఎన్టీఆర్ మహానుభావుడని.. ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచి ఉంటారని అన్నారు. జాతికి ఇలాంటి వారు ఒకళ్లే పుడతారన్నారు. తెలుగువారి గౌరవాన్ని చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారన్నారు. తాను బతికున్నంతవరకు ఎన్టీఆర్ తనకు తోడుగా ఉంటారని.. అడుగుడుగనా తనను రక్షించుకుంటూనే ఉన్నారని.. ఆయన జ్ఞాపకాల్లోనే తాను ఇంకా బతుకుతున్నానన్నారు లక్ష్మీపార్వతి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News