Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు ఇస్తా.. నేతలకు పవన్ కళ్యాణ్ స్పష్టం

Pawan Kalyan Review Meeting: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు వ్యక్తిగతం 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 12:02 PM IST
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు ఇస్తా.. నేతలకు పవన్ కళ్యాణ్ స్పష్టం

Pawan Kalyan Review Meeting: పార్టీ కోసం పని చేసేవారినీ, పార్టీ అంటే ఇష్టంవారినీ పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లే బాధ్యత నాయకులు తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. 2019 ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టిక్కెట్లు ఇచ్చామని.. అయితే  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రతి సీటు ముఖ్యమేనని నాయకులకు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బలంగా ఎలక్షనీరింగ్ చేయాలని చెప్పారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలామంది ఉదాసీనంగా వ్యవహరించారని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గురువారం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో సమీక్షలు ప్రారంభించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని దిశానిర్దేశం చేశారు.

టిక్కెట్ ఆశపడే అభ్యర్థులు వ్యక్తిగతంగా 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని.. అలాంటి వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంగా తెలిపారు పవన్ కళ్యాణ్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రూ.40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని చెబుతుంటే, తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని ఎలా చెబుతానానని నాయకుల వద్ద ప్రశ్నించారు. సభలకు వచ్చిన జనం.. పోలింగ్ బూత్ దగ్గర కనిపించాలనీ.. దీనికోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సన్నద్ధమై పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.

రాబోయే ఎన్నికల్లో ప్రతి సీటు కీలకమే.. అందువల్ల ప్రతి స్థానాన్ని గెలవడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొడుతున్నామనీ చెబుతూ, తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రచార విధానాలు అవలంబించాలి.. ఎక్కడ సభలను నిర్వహించాలనే ఇతర అంశాలను నాయకులతో చర్చించారు.

Also Read:  Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: Ap Cabinet: ఏపీ కేబినెట్ భేటీ, పెన్షన్ పెంపు, తుపాను పరిహారం, గ్రూప్ 1 ఉద్యోగాల భర్త

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News