గన్‌మెన్లను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్

రాష్ట్ర  ప్రభుత్వం తనకు కేటాయిచిన గన్ మెన్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  వెనక్కి పంపించారు. భద్రతా కారణాల  దృష్ట్యా నెల రోజుల క్రితం  పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నలుగురు గన్‌మెన్లను కేటాయించింది.  రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్‌మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు.

Last Updated : Apr 18, 2018, 02:09 PM IST
గన్‌మెన్లను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్

అమరావతి: రాష్ట్ర  ప్రభుత్వం తనకు కేటాయిచిన గన్ మెన్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  వెనక్కి పంపించారు. భద్రతా కారణాల  దృష్ట్యా నెల రోజుల క్రితం  పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నలుగురు గన్‌మెన్లను కేటాయించింది.  రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్‌మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు.

కారణం ఇదే..

ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలు బయటికు లీక్ అవుతున్నాయి. పార్టీ కార్యకలాపాలు లీక్ చేసేందుకు టీడీపీ సర్కార్  గన్‌మెన్లను వాడుకుంటోందని అనుమానిస్తున్న పవన్ ... తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఏది ఏమైనప్పటికీ పవన్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయంశంగా మారింది

Trending News