కరోనాతో హెడ్ కానిస్టేబుల్ మృతి

కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు (Head Constable Dies with Corona). లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి కోవిడ్19 టెస్టులు చేపించడంతో పాజిటివ్‌గా తేలింది. చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.

Last Updated : Aug 23, 2020, 08:43 AM IST
  • కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత
  • నెల్లూరు జిల్లా వెంకటాచలం పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌
  • కరోనాకు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
కరోనాతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CoronaVirus In AP), మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న హెడ్ కానిస్టేబుల్‌ కోవిడ్19 (COVID19)‌తో పోరాడుతూ శనివారం కన్నుమూశారు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

లక్షణాలు కనిపించడంతో ఇటీవల నిర్వహించిన కోవిడ్19 పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారం కిందట మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. హెడ్ కానిస్టేబుల్ మృతిపట్ల ఏపీ పోలీసుశాఖ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 

Trending News