చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ ; ఇక ఇస్త్రో చెంత జాబిల్లి రహస్యాలు

యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్ - 2 ప్రయోగం విజయవంతమైంది

Last Updated : Jul 22, 2019, 03:59 PM IST
చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ ; ఇక ఇస్త్రో చెంత జాబిల్లి రహస్యాలు

భారత అంతరిక్ష సంస్థ ఇస్త్రో చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జాబిల్లి వైపు పయనమైన భారతకు చెందిన చంద్రయాన్-2  ప్రయోగం విజయవంతమైంది.  ఫలితంగా అత్యంత సవాల్ తో కూడిన చంద్రయాన్-2 శాటిలైట్  కక్ష్యలోనికి ప్రవేశించినట్లయింది. 

ఐదు రోజుల తర్వాత..

మొత్తం 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహననౌక...భూమికి దగ్గరగా 170కి.మీలు.. భూమికి దూరం 39059కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో ఉపగ్రాహాన్ని విడిచిపెట్టింది. కాగా ఐదు రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న చంద్రయాన్ -2 లో  ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది. 

హర్షం వ్యక్తం చేస్తున్న భారతీయలు

చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి చంద్రయాన్‌-2 ద్వారా ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడమనేది అత్యంత సవాల్‌తో కూడిన పని. ప్రపంచ దేశాలకు సాధ్యం కానిది దీన్ని ఇస్త్రోతో ఇది సాధ్యపడింది. చంద్రుడి రహస్యాల చేధించేందుకు చంద్రయాన్ -2 పేరిట మన శాస్త్ర వేత్తలు చేసిన మరో ప్రయోగం సక్సెస్ కావడంతో యావత్ భారత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

 ప్రయోజనాలు ఇవే..
చంద్రయన్ -2 ప్రయోగంతో ఒనగూరే ప్రయోజనం విషయానికి వస్తే...తాజాగా పంపే ఉపగ్రహాల ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి.. ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది. రోజు రోజుకు భూ మండలంపై  ఖనిజాలు అంతరించి పోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ప్రపంచ అవసరాల కోసం చంద్రుడికిపై ఉన్న ఖనిజాలు ఉపయోగించే వీలు కల్గుతుంది. 

Trending News