YS Jagan Meets Governor: ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో భయానక పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. అత్యాచారాలు, హత్యలు, దాడులు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగిపోయి ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా దాడులు తీవ్రమవుతున్నాయి. కొన్నాళ్లు ఓపికతో సహించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాట బాట పట్టారు. వినుకొండలో రషీద్ హత్యపై ఆగ్రహంతో ఉన్న జగన్ తాజాగా గవర్నర్‌ను కలిశారు. ఏపీలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ బాటలోనే వైఎస్ జగన్
విజయవాడలోని రాజ్ భవన్‌లో ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఏపీ పాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దాడులను మాజీ సీఎం జగన్ వివరించారు. ఎన్నికల తరవాత అంతులేని దారుణాలు చోటుచేసుకుంటున్నాయని సవివరంగా తెలిపారు. కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్
'రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. మా పార్టీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. హత్యలు, దాడులు, అకృత్యాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆ దిశలోనే ఇన్ని రోజుల టీడీపీ కూటమి పాలన సాగింది' అని వైఎస్ జగన్ వినతిపత్రంలో తెలిపారు. '36 మంది హత్య. 300 మందిపై హత్యాయత్నాలు. టీడీపీ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. యథేచ్ఛగా 1050కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 2,700 కుటుంబాలు ఊళ్లు విడిచి వెళ్లిపోయాయి' అని వినతిపత్రంలో వైఎస్ జగన్ వివరించారు.
'ఓ మంత్రి హోర్డింగ్‌ల పేరిట హోర్డింగ్‌లు పెట్టి దాడులకు పురిగొల్పారు. అడ్డుకోవద్దని నిర్దేశించారు. వినుకొండలో నడిరోడ్డుపై దారుణ నరమేధం. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్లదాడి' అని చెబుతూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలతో గవర్నర్‌కు సమర్పించారు. రాష్ట్రంలో అరాచకాలను అంతమొందించాలని గవర్నర్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి స్థాపనకు చొరవ చూపాలని కోరారు. కేంద్ర సంస్థలు విచారణ జరిపేలా చూడాలని విన్నవించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి