Glass Symbol Issue: ఏపీ ఎన్నికల వేళ జనసేన పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసు విషయంలో కూటమి పార్టీలు, అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఏపీ హైకోర్టులో జనసేన గాజు గ్లాసు పంచాయితీపై ఎన్నికల సంఘం వాస్తవానికి నిన్న బుధవారమే వివరణ ఇచ్చింది. జనసేనకు స్వల్ప ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. తొలుత జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించగా ఆ పార్టీ కోరిక మేరకు జనసేన పోటీ చేసే ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా గాజు గ్లాసు స్వతంత్రులకు కేటాయించమని తెలిపింది. అయితే రాష్ట్రంలో ఎక్కడా గాజు గ్లాసు కేటాయించకూడదని తెలుగుదేశం, జనసేనలు మరోసారి అభ్యంతరం తెలుపడంతో ఇవాళ కూడా విచారణ సాగింది. అయితే ఇవాళ గాజు గ్లాసు పంచాయితీపై ఎన్నికల సంఘం తేల్చేసింది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నందున నిబంధనల మేరకు నిన్న ఇచ్చిన మినహాయింపుల తరువాత మిగిలినవారికి గాజు గ్లాసు కేటాయిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గాజు గ్లాసును జనసేన పార్టీకు రిజర్వ్ చేయలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదగలైనందున ఈ సమయంలో ఇతరులకు ఇచ్చిన గుర్తుల్ని మార్చలేమని తెలిపింది. ఈ పిటీషన్‌కు విచారణ అర్హతే లేదని పేర్కొంది.
ఈ పిటీషన్‌ను ఆమోదిస్తే ఇలానే పిటీషన్లు వస్తుంటాయని ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ మెషీన్లను ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు పంపించేశామని తెలిపింది. ప్రీ పోల్ అలయన్స్‌కు చట్టబద్ధత లేదని ఈసీ తెలిపింది. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రం గుర్తు మార్చేందుకు ఇప్పటికీ అవకాశముందని వాదించాయి. ప్రీ పోల్ అలయన్స్‌లో ఇబ్బందులను ఎన్నికల సంఘం గుర్తించాలని తెలుగుదేశం కోరుతోంది. ఏపీ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.
Also read: Top smartphones: శాంసంగ్, వన్‌ప్లస్, గూగుల్ నుంచి ఈ నెలలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook