ఏపీలో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల; మే 21న పోలింగ్

భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, మహారాష్ట్రలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల తేదీలను సోమవారం ప్రకటించింది

Last Updated : Apr 24, 2018, 09:37 AM IST
ఏపీలో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల; మే 21న పోలింగ్

భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, మహారాష్ట్రలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల తేదీలను సోమవారం ప్రకటించింది. మే 21వ తేదీన ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు స్థానిక సంస్థల అభ్యర్థిగా గెలుపొందిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఫిబ్రవరి 7న మృతి చెందడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  మహారాష్ట్రలో ఆరుగురు ఎమ్మెల్సీలు మే 31, జూన్‌ 21 తేదీలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ద్వైవార్షిక ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మే 31, జూన్ 21న ఆరుగురు  ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో మహారాష్ట్ర ఎన్నికలు తప్పనిసరి. ఈసీ ప్రకారం, రాయ్గఢ్-రత్నగిరి-సింధుదుర్గు స్థానం నుండి గెలుపొందిన అనిల్ దత్తాత్రే థాకరే పదవీకాలం మే 31 న ముగియనున్నది. జాదవ్ (నాసిక్), భాంగ్డియ మితే గోతులాల్(వార్ధా, చంద్రాపూర్, గడ్చిరోలి),  అబ్దుల్లా ఖాన్ ఎ. లతీఫ్ ఖాన్ దురైని (ప్రభాని-హింగోలి), ప్రవీణ్ రామచంద్రజీ(అమరావతి), దేశ్ముఖ్ దిలీప్ రావ్ దగ్దోజిరావ్ (ఉస్మానాబాద్-లాతూర్-బీడ్)ల గడువు జూన్ 21న ముగుస్తుంది.

ఈసీఐ షెడ్యూల్ ప్రకారం, ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 3 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 4న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే7,  మే 21న పోలింగ్ ఉంటుందని తెలిపింది. మే 24న కౌంటింగ్ ప్రక్రియ ఉండవచ్చని తెలిసింది. అయితే, మే 29 నాటికి ఎన్నికలు పూర్తవుతాయని ఎన్నికల సంఘం తెలిపింది.

Trending News