Chandrababu EC Notice: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ప్రసంగంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ప్రచార కార్యక్రమంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ప్రసంగం చేసినందుకు గాను వివరణ ఇవ్వాలని ఈసీ చంద్రబాబుకు ఆదేశించింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆల్టిమేటం జారీ చేసింది.
Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్ జగన్
మార్చి 31వ తేదీన చేసిన ఎమ్మిగనూర్, మార్కాపురం, బాపట్ల ప్రచార సభల్లో చంద్రబాబు ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'దొంగ, రాక్షసుడు, జంతువులు, హు కిల్డ్ బాబాయి' వంటి వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఈసీకి అందించారు. దీంతోపాటు యూట్యూబ్ లింక్‌లు కూడా ఇచ్చారు.
Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్ రాజీనామా
ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం ఇవ్వకపోతే తదుపరి కఠిన చర్యలు ఉండనున్నాయి. వాస్తవంగా ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధం. రెచ్చగొట్టేలా, ఇతరులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు చేయడం నేరం. ఈ నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదును స్వీకరించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. మరి బాబు ఎలాంటి బదులు ఇస్తారో ఆసక్తికరంగా మారింది.
ఇక ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రతో ప్రచారంలోకి దూసుకెళ్తుండగా.. చంద్రబాబు అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ఏపీలో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం కోసం వచ్చి అస్వస్థతకు గురై హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం జగన్, బాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook