Pawan kalyan on nagababu portfolio: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన నాగబాబుకు మంత్రిపదవి ఇచ్చే అంశంపై అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. నాగబాబు తనతో సమానంలో పార్టీ కోసం పనిచేశారన్నారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని.. బంధు ప్రీతీగానీ మరోకటి కానీ ఉండవన్నారు.
మాకు బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. అన్నయ్య సొంతగా ఎదిగారన్నారు. తర్వాతి జనరేషన్ కు ఒక అండగా మారామని చెప్పారు. నాగబాబు నాతో.. సమానంగా పనిచేసి.. వైసీపీ వాళ్ల తిట్లు కూడా తిన్నారని అన్నారు. కందుల దుర్గేష్ అసలు ఏ కులమో కూడా తెలీదన్నారు.
కేవలం పనితీరు ఆధారంగా మినిస్ట్రీని కేటాయించినట్లు తెలిపారు. నాగబాబును తొలుత ఎంపీగా చేయాలనుకున్నామని.. కానీ ఆయన సేవలకు కాను మరల తమ అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి సముచిత పదవి ఇవ్వడం ఖాయమన్నారు. పార్టీలో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకుంటామని జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
తాము ఎక్కడ కూడా కులం, బంధు ప్రీతీ కానీ చూడటం లేదని.. కేవలం పార్టీ కోసం ఎంత పనిచేశారు.. అన్నదే ప్రామాణికంగా సముచిత స్థానం కల్పిస్తున్నామని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter