AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!

CM Jagan On AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల కోటాలో మూడు సీట్లు ఓడిపోగా.. పూర్తి బలం ఉన్న ఎమ్మెల్యే కోటాలోనూ ఓ సీటు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 12:58 PM IST
AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!

CM Jagan On AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల సంచలనం రేకెత్తిస్తున్నాయి. పట్టభ్రదుల కోటాలో మూడు సీట్లు గెలుచుకున్న టీడీపీ.. ఎమ్మెల్యే కోటాలోనూ ఒక సీటులో విజయం సాధించి అధికార పార్టీకి షాకిచ్చింది. మొత్తం ఏడుస్థానాలకు గురువారం జరగ్గా.. ఆరు స్థానాలను వైసీపీ, ఒక స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నాయి. నిజానికి అసెంబ్లీలో టీడీపీకి బలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టి.. విజయం సాధించడం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. విజయం సాధించాలంటే 22 మంది సభ్యుల మద్దతు కావాలి. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి అనూహ్యంగా గెలుపొందారు.

వైసీపీ నుంచ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోయారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బహిరంగంగానే ఇటీవల వైసీపీపై విమర్శలు గుప్పించారు. వీరిద్దరు ఓట్లు టీడీపీకి పడతాయని ముందే అందరూ అంచనా వేశారు. మరో ఇద్దరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

ఓటు వేసిన అనంతరం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఫోన్ స్విచ్ఛాఫ్‌ చేసుకుని బెంగుళూరుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తన కార్యాలయంలో సీఎం జగన్, పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా తీసేయించినట్లు సమాచారం. దీంతో ఈయన క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఇక శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తమ ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని చెప్పారు. అయితే శుక్రవారం వీరిద్దరు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో అనుమానలకు మరింత బలం చేకూరుతోంది. 

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వనని సీఎం జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మీరు ఓటు వేసినా వేయకపోయినా.. ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వనని ఆ ఎమ్మెల్యేలకు జగన్ స్పష్టం చేశారని అంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించి.. ఎలాగైనా ఓప్పించి పార్టీలోనే ఉండాలే చూస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో డేరింగ్ స్టెప్ వేశారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వనని ముందే తేల్చిచెప్పారు. వాళ్లు ఓటు వేయకపోతే ఎమ్మెల్సీ సీటు పోతుందని తెలిసినా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. వారికి ఇప్పుడు ఏదో ఆశ చూపించి ఓటు వేయించుకుని.. తరువాత హ్యాండ్ ఇవ్వడం కంటే ముందే క్లారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే సీట్లు గెలవాలని సీఎం జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సరిగా నిర్వహించని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదనే భావించిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో టికెట్‌పై లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆ ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లను వైసీపీ అధిష్టానం బయటపెట్టే అవకాశం ఉంది.

Also Read:  Ajith Father Death : తలా ఇంట్లో విషాదం.. అజిత్ తండ్రి మరణం

Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News