Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలేకపోయిన చంద్రబాబు..

Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇందులో మూడు సార్లు చంద్రబాబు సొంత బలంతో కాకుండా కూటమి బలంతోనే అధికారంలోకి వచ్చారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 6, 2024, 09:33 AM IST
Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలేకపోయిన  చంద్రబాబు..

Chandrababu Naidu: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు విభిజిత ఏపీలో చంద్రబాబు నాయుడు తన పేరిట ఓ రికార్డు నెలకొల్పారు. సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కూడా అరుదైన రికార్డు నెలకొల్పారు. బహుశా ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేయలేరేమో అని చెప్పాలి. అయితే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరికొన్ని రోజుల్లో నాల్గోసారి సీఎం పీఠం అధిష్ఠించబోతున్నారు. తొలిసారి విడిచిపెడితే.. మిగిలిన మూడు సార్లు చంద్రబాబు నాయుడు కూటమిగానే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. సొంత బలంతో ఎపుడు ముఖ్యమంత్రి కాలేకపోయారు.

తొలిసారి అన్న ఎన్టీఆర్ ను పదవీచ్యుడిని చేసిన తర్వాత 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పట్లో సొంతంగా కాకుండా అన్నగారిని పార్టీ నుంచి బహిష్కరించి పార్టీ లాక్కొని సీఎం పీఠం ఎక్కారు. పార్టీలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రెండో అధికార కేంద్రంగా మారిందని చెప్పి.. ప్రజాస్వామ్య బద్ధంగా కుటుంబ సభ్యుల సహాకారంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు.

ఆ తర్వాత 1998లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకొని మంచి ఊపు మీదుంది. మరోవైపు వాజ్ పేయ్ ప్రభుత్వం జయలలిత కారణంగా ఒక్క ఓటుతో కేంద్రంలో అధికారంలోకి కోల్పోయింది. అప్పటికే 1999లో కార్గిల్ యుద్ధంలో విజయంతో వాజ్ పేయ్ ఇమేజ్ హిమాలయాలంత ఎత్తుకు ఎదిగింది. దీంతో 1999లో లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టి ఎన్నికల్లో వెళ్లారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రికార్డు మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. 1998 12వ లొక్ సభతో పాటు 1999లో జరిగిన 13వ లోక్ సభలో కీలకమైన స్పీకర్ పదవిని తీసుకున్నారు. అలా కేంద్రంలో బీజేపీ పొత్తు వల్లే ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.

ఆ తర్వాత 2003లో జరిగిన అలిపిరి ఘటనతో ఆరు నెలలు ముందుగానే రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు కేంద్రంలో వాజ్ పేయ్ సర్కారు ముందస్తు ఎన్నికలు వెళ్లారు. 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. ఆ ఎఫెక్ట్ కేంద్రంలో వాజ్ పేయ్ పై పడటంతో అక్కడ మరోసారి ఎన్డీయే సర్కారు ఏర్పాటు చేయలేకపోయింది. 1999లో బీజేపీతో పొత్తు కారణంగా గెలిచిన చంద్రబాబు.. 2004లో అదే పొత్తు వల్ల కేంద్రంలో వాజ్ పేయ్, రాష్ట్రంలో చంద్రబాబు ఇద్దరు నష్టపోయారు.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో చంద్రబాబు టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో మహా కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ప్రజా రాజ్యం కారణంగా చంద్రబాబుకు మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. మరోసారి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది.

ఇక 2014లో మరోసారి బీజేపీ తో పొత్తు పెట్టుకొని కూటమిగా బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మూడోసారి విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019లో ఒంటరిగా తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో వెళ్లి ఘోరంగా దెబ్బతింది. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది.

కట్ చేస్తే 2024లో భారతీయ జనతా పార్టీ, జనసేనలతో కూటమిగా ఏర్పడి ఎన్నికల గోదాలో దిగింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు గతంలో ఎన్నడు లేనన్ని సీట్లు కట్టబెట్టారు ప్రజలు. కూటమిగా 164 సీట్లతో సంచలనం రేపారు. తెలుగు దేశం పార్టీకే 135 సీట్లు గెలుచుకుంది. మరోవైపు జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో గెలిచి ల్యాండ్ సైడ్ విక్టరీ నమోదు చేసింది. మరోవైపు బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దీంతో నాల్గోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నాలుగు సార్లలో ఒకసారి భారతీయ జనతా పార్టీ పొత్తు కారణంగానే గెలిస్తే.. మరోసారి ఓడిపోయారు. 2014, 2024లో బీజేపీ, జనసేన పొత్తు కారణంగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రకంగా సొంత బలంతో కాకుండా కూటమిగా సీఎం అయిన వ్యక్తిగా చంద్రబాబు నిలిచారు. సొంతంగా పోటీ చేసిన సందర్బాల్లో గెలిచిన సందర్భాలు లేవు. ఏది ఏమైనా ఎన్నికల్లో చివరకు గెలుపు అనేదే ముఖ్యంగా అందులో పొత్తులు, ఎత్తులు అనేవి ఓ భాగం అని చెప్పాలి.

Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News