Andhra Pradesh Flood Areas update on Electricity Bills : ఆంధ్ర ప్రదేశ్ వరదలకు అల్లకల్లొలంగా మారిపోయింది. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు, సింగ్ నగర్ ప్రాంతాలు వరదల ధాటికి కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలలో ఎక్కడ చూసిన కూడా అపార్ట్ మెంట్ లలో భారీగా వరద నీళ్లు వచ్చి చుట్టుముట్టాయి. ఇప్పటికి కూడా అక్కడి ప్రజలు వరదల నీళ్లలోని కంటి మీదకు కునుకులేకుండా.. గడుపుతున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఐదు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను దగ్గరుండి చూసుకుంటున్నారు. అంతేకాకుండా.. మంత్రుల్ని, అధికారుల్ని సైతం సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న వరదలపై కేంద్రం కూడా తన వంతుగా ఆపన్న హాస్తం అందిస్తుంది.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నిన్న (గురువారం) వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరుండి చూశారు. సీఎం చంద్రబాబు, ఏపీ అధికారులు వదరలపై ప్రజలు ఎదుర్కొంటుున్న ఇబ్బందులను, పంట నష్టాలను అధికారులకు వివరించారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 2 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. వరద నష్టంపై నిపుణులు బృందాలు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత కేంద్రం సహాయం కావాలని కూడా ఏసీ సర్కారు కొరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. కేంద్రం హెలికాప్టర్, వాయిసేన, ఎన్డీఆర్ పై దళాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కొన్నిరోజులుగా ఏపీలోని వరద ప్రాంతాల్లో.. కరెంట్ బిల్లులు, బకాయిల వసూలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. మంచి నీరు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా.. రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్ సమస్యలను, ఇతర అన్నిరకాల సమస్యల్ని పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. వరదల్లో పాడైపోయిన.. వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్‌ల రిపేర్లు.. ఇలా ఏ రిపేర్‌కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ఇటువంటి సేవలు అందించేవారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు.
Read more: Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. మూడడుగుల దూరంలో ఆగిన ట్రైన్.. వీడియో వైరల్..
వరద ప్రాంతాల్లో కొంత మంది ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది రంగంలోకిదిగి అనేక ఇళ్లను శుభ్రం చేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే రవాణా, వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిత్యవసారాలు, కూరగాయలు కూడా తక్కువ ధరకే అందేలా చూస్తున్నట్లు కూడా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.