ప.గో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పోలవరం సందర్శన అనంతరం ఇరువురు పోలవరం అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పోలవరం నిర్మాణ పనులకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు 2019 డిసెంబరు వరకు డెడ్లైన్ పెట్టుకున్నామని ..ఈ లోపు ప్రాజెక్టు పూర్త చేయాలంటే కేంద్రం నుంచి నిధులు అవసరమని నితిన్ గడ్కరీని కోరారు. ప్రసుత అంచాల ప్రకారం పోలవరానికి రూ.57 వేల 940 కోట్లు అవసరమని.. ఒక్క భూసేకరణకే రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఇవి కాకుండా పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2 వేల 200 కోట్ల బకాయిలను కేంద్ర సర్కారు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.