Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి కోటంరెడ్డి ఇంటికి పోలీసులు.. సీసీటీవీ డీవీఆర్ విషయంలో వాగ్వాదం

Attack On Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. సీసీటీవీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ కావాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 10:48 AM IST
  • కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కారుతో ఢీకొట్టిన వ్యక్తి
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
  • సీసీటీవీ ఫుటేజ్ కోసం కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు
Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి కోటంరెడ్డి ఇంటికి పోలీసులు.. సీసీటీవీ డీవీఆర్ విషయంలో వాగ్వాదం

Attack On Kotamreddy Srinivasulu Reddy:  కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై శనివారం రాత్రి జరిగిన దాడి ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనియాంశమైంది. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి వెనుక ముమ్మాటికి వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసం వద్ద చోటుచేసుకున్న మరో ఘటన మీడియాలో అనేక చర్చలకు దారితీస్తోంది. దుండగుడి చేతిలో గాయపడిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన నివాసం వద్దకు చేరుకున్న బాలాజీ నగర్ పోలీసులు.. అక్కడి సీసీటీవీ డీవీఆర్ ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులను డిమాండ్ చేశారు. 

అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. సీసీటీవీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ కావాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు. స్థానిక సీఐ రాములు నాయక్ అధ్వర్యంలో ఇంటికి వచ్చిన పోలీసులకు తాము సహకరించి సీసీటీవీ దృశ్యాలు ఇచ్చినప్పటికీ... డీవీఆర్ కావాలని బలవంతం చేశారని కోటంరెడ్డి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. 

అయితే, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పోలీసులు వచ్చి డివిఆర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు అనే సమాచారం అందుకున్న కోటంరెడ్డి అభిమానులు, అనుచరులు, టీడీపీ శ్రేణులు అర్ధరాత్రి భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. నిందితుని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కోటంరెడ్డి అభిమానులు, అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 

రాజకీయ కుట్రతోనే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరిగిందని.. ఈ దాడి ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కోటంరెడ్డి కుటుంబసభ్యులు సీసీటీవీ దృశ్యాలు ఇచ్చినప్పటికీ.. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ దృశ్యాలు రికార్డ్ అయిన హార్డ్ డ్రైవ్ కావాలని అడుగుతున్నారని కోటంరెడ్డి వర్గీయులు ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మద్దతుదారుల రాకతో పోలీసులు సీసీటీవీ విజువల్స్ తీసుకుని వెనుతిరిగారు. 

Also Read : Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి దాడి.. వీడియో వైరల్

Also Read : B.Tech Students Dance: క్లాస్ రూమ్‌లో విద్యార్థుల అసభ్యకర నృత్యం.. వీడియో వైరల్

Also Read : Pawan Kalyan About Caste: దేశం భావన లేకపోయినా.. కులం భావన పెట్టుకోండి: పవన్ కళ్యాణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News