CBI on Social Media: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(Ycp government)ఏర్పడిన తరువాత..ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగానే జరిగింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు కొన్నిచోట్ల బహిరంగంగా బ్యానర్లు కూడా కన్పించాయి. తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఈ ట్రోలింగ్ ఆధారం చేసుకుని దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్బంగా కేసు విచారణను సీబీఐకు అప్పగించారు.
ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ పోస్టులు పెట్టినవారికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి సీబీఐకు(CBI) అప్పగించింది. ఇందులో ఇప్పటికే కొందరికి విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయానికి రప్పించి విచారణ చేశారు.ఇంకొందరికి విజయవాడలో విచారిస్తున్నారు. కీలక ఆధారాలతో మూడు నివేదికల్ని సీబీఐ హైకోర్టుకు (High Court) సమర్పించింది. మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగించాలని..మరో 3 నెలల సమయం పడుతుందని సీబీఐ తెలిపింది. కేసు విచారణ 3 నెలలకు పాటు వాయిదా పడింది.
Also read: Curfew Ralaxations: ఏపీ కర్ఫ్యూ వేళల్లో మరిన్ని సడలింపులు, ఆ రెండు జిల్లాలు మినహాయించి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook