ఫెడరల్ స్పూర్తి అంటే ఇది కాదు : నీతి ఆయోగ్ సమావేశంలో మోదీతో చంద్రబాబు

Last Updated : Jun 17, 2018, 08:54 PM IST
ఫెడరల్ స్పూర్తి అంటే ఇది కాదు : నీతి ఆయోగ్ సమావేశంలో మోదీతో చంద్రబాబు

ఢిల్లీలో నేడు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆంధ్రాకు ప్రత్యేక హోదా దక్కకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని ఈ సమావేశంలో వివరించే ప్రయత్నం చేశారు. హోదా దక్కకపోవడం వల్ల రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను ఈ సమావేశం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకు వెనక్కు వెళ్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. వ్యవసాయ రంగం 2013-14 ఆర్థిక సంవత్సరంలో 23శాతం వృద్ధి కనిపిస్తే, 2017-18లో 34 శాతంగా నమోదైందని తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం గురించి సైతం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఫెడరల్ స్పూర్తితో సంపూర్ణ భారత్ నిర్మాణం జరిగితే బాగుంటుంది అని చంద్రబాబు మోదికి సూచించారు.

సమావేశం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రత్యేక హోదా డిమాండ్‌కి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి గట్టి మద్దతు లభించడం విశేషం.

Trending News