ఇక పందెంకోళ్ళను ఆన్‌లైన్‌లో కొనేయండి

సంక్రాంతి అల్లుళ్లు ఇక సంబరాలు చేసుకోనున్నారు. వచ్చే నెల సంక్రాంతి పండగ వస్తున్న క్రమంలో ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో పందెంకోళ్ళకు బాగా గిరాకీ పెరిగింది.

Last Updated : Dec 10, 2017, 05:18 PM IST
 ఇక పందెంకోళ్ళను ఆన్‌లైన్‌లో కొనేయండి

సంక్రాంతి అల్లుళ్లు ఇక సంబరాలు చేసుకోనున్నారు. వచ్చే నెల సంక్రాంతి పండగ వస్తున్న క్రమంలో ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో పందెంకోళ్ళకు బాగా గిరాకీ పెరిగింది. అయితే ఈ సారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. అదేంటంటే.. ఒకప్పుడు పందెంకోళ్ళను కొనాలంటే జిల్లా కేంద్రాలను మాత్రమే సందర్శించేవారు.

మంచి జాతి పుంజులను కొని.. వాటికి జీడిపప్పుతో పాటు బలవర్థమైన ఆహారాన్ని ఇచ్చి పందేలకు దీటుగా తయారుచేసేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. పందెంకోళ్ళను అమ్మడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకొని వస్తున్నాయి పలు కంపెనీలు. అందుకు గాను పలు వెబ్ పోర్టల్స్ కూడా ప్రారంభించాయి. ఈ పోర్టల్స్‌లో ఈ కోళ్ళను పెంచడానికి ఎలాంటి దాణా వేయాలో కూడా సూచిస్తున్నారట.

సాధారణంగా పందెం కోళ్ళ పెంపకానికి ప్రత్యేకమైన శిక్షణ ఉంటుందట. వాటితో వ్యాయామం చేయించడానికి ప్రత్యేక శిక్షకులు కూడా ఉంటారట. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఒక్కో పందెంకోడి ధర 50 వేల పైమాటేనట. 

 

Trending News