మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలకు బాలయ్య వివరణ

                     

Last Updated : Apr 22, 2018, 08:46 PM IST
మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలకు బాలయ్య వివరణ

ప్రధాని మోడీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఏపీకి అన్యాయం చేసిందుకు తన అవేదనను అలా  తెలియజేశానని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై తెలుగు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. తెలుగువారి ఆగ్రహాన్ని తన భావాల్లో వ్యక్తపరిచానన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బాలకృష్ణ పర్యటించారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీపై తను చేసిన వ్యాఖ్యలపై ఇలా వివరణ ఇచ్చుకున్నారు. 

రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఒక్క రోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలయ్య కేంద్ర ప్రభుత్వం, మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ  సందర్భంగా బాలయ్య చేసిన ప్రసంగాన్ని బీజేపీ నేతల తప్పుబట్టారు. ఆయనపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Trending News