Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ సతీమణి?

Atmakur By Election: రాబోయే ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక గురించి అధికార వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తికి అవకాశం ఇస్తారని సర్వత్రా చర్చ జరగుతోంది. అయితే ఈ విషయంపై వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 11:45 AM IST
Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ సతీమణి?

Atmakur By Election: ఇటీవలే గుండెపోటుతో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించారు. ఆయన మృతితో నెల్లూరులోని ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో మేకపాటి గౌతమ్ స్థానంలో అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. మంత్రి గౌతమ్ మరణం తర్వాత ఆయన స్థానంలో మేకపాటి కుటుంబసభ్యులకే అవకాశం ఇవ్వనున్నారని అధికార పార్టీ వర్గాల సమాచారం. 

ఇప్పుడు ఆ స్థానంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే జరగబోయే ఉపఎన్నికలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకీర్తి రెడ్డికి అవకాశం ఇస్తారని సమాచారం. ఇదే విషయమై అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే రానున్న ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికలో ఎవర్ని ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని వైసీపీ అధిష్టానం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.  

మేకపాటి గౌతమ్ మృతి

ఆంధ్రప్రదేశ్ ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటుతో హఠ్మారణానికి గురయ్యారు. ఆయన గతంలో తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినా.. ఆ తర్వాత జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గౌతమ్.. జగన్ క్యాబినేట్ లో ఐటీ, భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.  

Also Read: Srisailam Temple News: శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడ భక్తుల వీరంగం.. దుకాణాలు, వాహనాలను ధ్వంసం!

Also Read: AP Power Charges Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. యూనిట్ కు ఎంత పెరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News