AP JOBS Good News: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 8 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ త్వరలో చేపట్టనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ఏపీ ప్రభుత్వం(Ap government)నిరుద్యోగులకు శుభవార్త అందిస్తోంది. మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకు రంగం సిద్ధం చేస్తోంది. ఏకంగా 8 వేల 402 సచివాలయ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పంచాయితీరాజ్ , స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister peddireddy ramachandra reddy)సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని మంత్రి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 8 వేల 4 వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఖాళీల వివరాల్ని ఏపీపీఎస్సీ(APPSC)కు పంపి క్యాలెండర్ ప్రకారం త్వరలో భర్తీ చేస్తామన్నారు. మరోవైపు ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.
Also read: Vizag Steel plant: సొంతంగా గనులు లేకపోవడమే కారణమని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook