Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. క్రమంగా ఇది వాయుగుండంగా బలపడవచ్చు. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఏపీ, తెలంగాణలో డిసెంబర్ 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షసూచన జారీ అయింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఈ నెల 11, 12 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈదురు గాలులు కూడా బలంగా వీయవచ్చు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదమున్నందున ఆరుబయట సంచరించవద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలాల్లో, చెట్ల కింద, టవర్ల కింద ఉండవద్దని హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. పంటకోతల విషయంలో రైతన్నలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
Also read: Snowfall Images: మంచు దుప్పటి కప్పుకున్న ఉత్తరాది, మైనస్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.