Rain Alert: ఏపీలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఎండలు మరోవైపు వడగాలుల తీవ్రత పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువే ఉంటున్నాయి. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందన్న వార్తల నేపధ్యంలో వాతావరణ శాఖ నుంచి చల్లని కబురు అందింది.
ఓ వైపు వడగాలులు, మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజానీకానికి గుడ్‌న్యూస్. ఏపీలోరానున్న రెండ్రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి.
మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని ప్రాంతాల్లో రానున్న మూడ్రోజులు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రమంతా వడగాలులు వీస్తున్నాయి. నంద్యాలలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీలు నమోదైంది. ఇక అనంతపురం జిల్లాలో గరిష్టంగా 41-43 డగ్రీలు నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాంధ్రలోని పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు మూడు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 41-45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also read: Times Now-ETG Survey: దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీకు ఎన్ని సీట్లు, ఏపీలో ఈసారి అధికారం ఎవరిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook