AP Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల కేసులో..సుప్రీంకోర్టులో మారిన బెంచ్, సర్వత్రా ఆసక్తి

AP Panchayat Elections 2021: ఏపీ స్థానిక పంచాయితీల ఎన్నికల వివాదంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మారిన పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనకారి కానుందా..లేదా ఎన్నికల కమీషన్‌కు లాభం చేకూర్చనుందా అనే విషయం ఆసక్తి రేపుతోంది. 

Last Updated : Jan 24, 2021, 05:47 PM IST
  • పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
  • స్పెషల్ లీవ్ పిటీషన్పై విచారణ బెంచ్‌ను మార్చిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
  • బెంచ్ మార్పిడి పరిణామంతో సర్వత్రా ఆసక్తి రేపుతున్న రేపటి విచారణ
AP Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల కేసులో..సుప్రీంకోర్టులో మారిన బెంచ్, సర్వత్రా ఆసక్తి

AP Panchayat Elections 2021: ఏపీ స్థానిక పంచాయితీల ఎన్నికల వివాదంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మారిన పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనకారి కానుందా..లేదా ఎన్నికల కమీషన్‌కు లాభం చేకూర్చనుందా అనే విషయం ఆసక్తి రేపుతోంది. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat Elections ) నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్ కు మధ్య చెలరేగిన వివాదం ఆగేట్టు కన్పించడం లేదు. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు ( Supreme court ) ముంగిటకు చేరింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) స్పెషల్ లీవ్ పిటీషన్ ( Special leave petition ) దాఖలు చేసుకుంది. ఈ పిటీషన్‌పై రేపు అంటే జనవరి 25వ తేదీన విచారణ జరగనుంది. 

ఏపీ ప్రభుత్వం అభ్యంతరాల్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా స్థానిక పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ( Election Notification )  విడుదల చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar ). దీనికి వ్యతిరేకంగా హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. అయితే హైకోర్టు  ( High Court ) సింగిల్ బెంచ్ స్టేను సవాలు చేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేయగా..డివిజన్ బెంచ్ స్టే కొట్టివేస్తూ..ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్  వెలువరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగులు మండిపడ్డారు. 

Also read: Aarogyasri Card: కేవలం 8 గంటల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు జారీతో ఉద్యోగులు రికార్డు

మరోవైపు ఈ అంశంపై హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో విచారణ కోసం ఈ పిటీషన్‌ను ఉంచారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ( Supreme court Registry ) దీన్ని మార్చింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం నుంచి..జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్ బెంచ్‌కు బదిలీ చేశారు. జరిగిన ఈ మార్పు ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి రేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనంగా ఉంటుందా..లేదా ఎన్నికల కమీషన్‌కు లబ్ది చేకూరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ , వ్యాక్సినేషన్ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ( Supreme court ) లో పిటీషన్ దాఖలు చేశాయి. 

Also read: Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న Asha Worker మృతి, బంధువుల ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News