Pawan Kalyan Casts His Vote: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న Jana Sena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 10, 2021, 12:55 PM IST
  • జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
  • విజయవాడలోని పటమట లంక జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్‌లో పవన్ కళ్యాణ్ ఓటు
  • 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది
Pawan Kalyan Casts His Vote: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న Jana Sena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

AP Municipal Elections 2021: ఏపీలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో ఏపీ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలోని పటమట లంక జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్ ఓటు వేశారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు విజయవాడకు విచ్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan)‌కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, 4 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 

Also Read: AP Municipal Elections 2021 Voting: ఏపీలో ప్రశాంతంగా జరుగుతున్న పురపాలక, నగరపాలక ఎన్నికలు, మార్చి 14న కౌంటింగ్

ఏపీ ఎస్ఈసీ పరిశీలన..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు జరుగుతున్న పురపాలక, నగరపాలక ఎన్నికల(AP Municipal Elections 2021) ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సందర్శించి ఓటింగ్ సరళిని స్వయంగా గమనించారు.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పెరిగిన Silver Price  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News