AP: మహిళల అభివృద్ధికి ప్రముఖ కంపెనీలతో ఒప్పందం

మహిళల సాధికారత ( Women empowerment ) కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి మరింత తోడ్పాటు అందించేందుకు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Last Updated : Aug 20, 2020, 05:44 PM IST
AP: మహిళల అభివృద్ధికి ప్రముఖ కంపెనీలతో ఒప్పందం

మహిళల సాధికారత ( Women empowerment ) కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి మరింత తోడ్పాటు అందించేందుకు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

మహిళల స్వావలంబన కోసం ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత ( ysr cheyutha ) పధకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సమాజంలోని వెనకబడిన వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మహిళలకు సహాయం అందించడమే ఈ పదకం లక్ష్యం. ఇదే పధకం కింద మహిళల అభివృద్ధి కోసం ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ( Ap government ) ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో ( Reliance jio ), అల్లాన ( Allana ) కంపెనీలతో ఎంవోయూ చేసుకుంది ప్రభుత్వం. మహిళా సాధికారత కోసం 11 వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే వీరికి స్థిరమైన జీవనోపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే అమూల్ ( Amul ) , హెచ్ యూ ఎల్ ( HUL ), ఐటీసీ ( ITC ) , ప్రాక్టర్ అండ్ గేంబుల్ ( procter & Gamble ) కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియా , అల్లానా గ్రూపులు ప్రభుత్వంతో భాగస్వాములయ్యాయి. Also read: Ap Tourism: సెప్టెంబర్ నుంచి పర్యాటకం ప్రారంభం

Trending News