Kalki: ప్రభాస్ బుజ్జి కారులో ఏపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ఆర్ షికారు..

Kalki: ‘కల్కి 2898 AD’ సినిమా చూసిన వాళ్లకు అందులో ప్రభాస్ నడిపించిన ‘బుజ్జి’ కారు ఎంతో ఫేమస్ అయింది. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జికి మంచి ఇంపార్టెన్స్ ఉంది. తాజాగా కల్కి లో ప్రభాస్ నడిసిన కారును ఏపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అభిమానుల నడమ నడిపి సందడి చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 3, 2024, 09:50 AM IST
Kalki: ప్రభాస్ బుజ్జి కారులో ఏపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ఆర్ షికారు..

Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్  బ్యానర్ పై తెరకెక్కిన  ‘కల్కి’ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ డే షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ .. అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. మరోవైపు కమల్ హాసన్ ఉన్నది కాసేపు అయినా.. తనదైన శైలిలో మెప్పించారు. ఈ సినిమాలో దీపికా సుమతి పాత్రలో నటించింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో ప్రభాస్ ‘బుజ్జి’ కారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.  ప్రేక్షకులు, చిన్నారులు కూడా ఈ బుజ్జి కారును చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ తోలిన ఈ కారును ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో ఉంచారు. ముందు రోజు.. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఈ కారును ప్రదర్శించారు. అభిమానులు కూడా ఈ కారును చూసి దాంతో సెల్ఫీలు దిగుతున్నారు.

మరోవైపు బుజ్జికారును మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో తిప్పుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఉండి గ్రామంలో ఈ కారును ప్రదర్శించారు. అక్కడ ఈ కారును ఏపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అభిమానుల మధ్య నడిపి సందడి చేశారు. ఈ సందర్బంగా ఈ సినిమా ఘన విజయం సాధించినందకు చిత్ర యూనిట్ కు అభినందలు తెలియజేసారు.

కల్కి సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా అన్ని ఏరియాల్లో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 315 కోట్ల షేర్ (రూ. 600 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు సెకండ్ వీకెండ్ వరకు  ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయడం పక్కా అని చెబుతున్నారు. మరోవైపు పెంచిన ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించబోతున్నారు. దీంతో ఈ సినిమా వసూల్లు పెరిగే అవకాశం ఉంది.

Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News