AP Ministers Sensational comments on Volunteers: ఏపీ వాలంటీర్ల అంశం పెను దుమారం సృష్టిస్తోంది. రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు తమను తిరిగి తీసుకోవాలన్న వారిపై మంత్రులు మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లు రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడంతో తమ పరిస్థితి ఏంటని వాళ్లు ప్రస్తుత మంత్రులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటి? మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ మంత్రులను వేడుకుంటున్నారు.
అయితే, మంత్రులు అసలు మిమ్మల్ని రాజీనామా ఎవరు చేయమన్నారు? ముందుగా వారిపై కేసు పెట్టి రండి అప్పుడు చూద్దాం అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే, తమ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుందని టీడీపీ చెప్పింది. అంతేకాదు ఐదు వేలు ఉన్న జీతం పదివేలకు సైతం పెంచుతామని కూడా చెప్పింది. అయితే, ప్రస్తుతం రాజీనామ చేయని వాలంటీర్లు కూడా తమ పరిస్థితి ఏంటో అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్..
రాజీనామా చేసే సమయంలోనే నేన దండం పెట్టి చెప్పా రాజీనామా చేయకండి. రేపు తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుంది. తమ ప్రభుత్వం వచ్చాక జీతాలు కూడా పెంచుతాం అని చెప్పాం ఇప్పుడు ఇది ప్రభుత్వ పాలసీ అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. దీంతో వాలంటీర్ల భవిష్యత్తు ఏంటని ప్రశ్నర్ధకంగా మారింది.
ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వ ఏం చేస్తుంది? అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ శాతం పల్లెల్లో వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ సమయంలోనే ఏ ఒక్క వాలంటీర్ కూడా అప్పటి ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేయకూడదని పక్కన బెట్టారు. ఈనేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజీనామా చేసిన వాలంటీర్లను ఏ ప్రతిపాదికన తీసుకోవాలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే, రిజైన్ చేసిన వాలంటీర్లు మాత్రం ఇప్పుడు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ప్రతి మంత్రి వద్దకు వెళ్లి తమ భవిష్యత్తు ఏంటని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం ముందు అర్జీ పెట్టాలని చూస్తున్నారు.
ఇదీ చదవండి: వైఎస్సార్, జగన్ పేర్లు తొలగింపు.. పథకాల పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు వారంతా వైసీపీ పార్టీకి చెందినవారే వాలంటీర్లుగా నియామకం చేపట్టామని చెప్పిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని టీడీపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా? లేకపోతే కొత్తవారిని ఎంపిక చేసుకుంటారా? తెలియాల్సి ఉంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter