అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో (AP Local Bodies Elections)స్థానిక సంస్థల ఎన్నికల సమరం అధికార, విపక్షాల మధ్య వాడి వేడి వాతావరణం కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ దూకుడు పెంచింది. సంక్షేమమే తమ ప్రచారాస్త్రమని, అభివృద్ధే వైయస్‌ఆర్‌సీపీ ఆయుధమని అంటోంది. కాగా అధికార వైస్సార్సీపీ, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని అధిష్టానం ఆదేశించిందని, ఎవరైనా పోటీలో నిలిపితే వారికి బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: కమల దళంలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
ఈ సందర్భంలో ఒకవైపు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్న తరుణంలో పరిస్థితులను చెడగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని, విజయవాడ నుండి 10 కార్లలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మరికొందరు గూండాలు వచ్చారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read: దిగొచ్చిన పెట్రో ధరలు
మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు సీఎం వైయస్ జగన్ బి-ఫారాలు అందజేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..