AP High Court: సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వచ్చిన పోస్టుల్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Oct 7, 2020, 11:19 AM IST
AP High Court: సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )  హైకోర్టు ( High court ) సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వచ్చిన పోస్టుల్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం  ( Ap Government ) ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ తరువాత న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వివిధ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, పోస్టులు వచ్చాయి. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులపై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. ఆ పోస్టుల్ని, వ్యాఖ్యల్ని చట్టప్రకారం తొలగించాలని...సంబంధించిన యూఆర్ఎల్ లను కంపెనీలకు అందించాలని సీఐడీకు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరాంను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 

సీఐడీ ( CID ) అధికారులు నమోదు చేసిన కేసుల్లో పురోగతి లేదని, సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వంపై పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ మాట్లాడుతూ ప్రధాన పిటిషన్‌లో అదనంగా కొన్ని అంశాలను చేరుస్తూ సవరణ పిటిషన్‌ వేశామని చెప్పారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్‌ శ్రీరాం  కోరారు. Also read: Rain updates: 9న మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

Trending News