AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఓ రోజు పెరగడం, రెండవరోజు తగ్గడం జరుగుతోంది. నిన్నటితో పోలిస్తే..ఇవాళ మరోసారి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఏపీలో కరోనా వైరస్(Coronavirus) సంక్రమణ క్రమంగా కొనసాగుతోంది. కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే తగ్గినా..ఒక్కోరోజు భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 49 వేల 581 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 1145 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. మరో 17 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 987 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 96 వేల 756 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో వేయిమంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 15 వేల 157 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 25 వేల 9 వందలకు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 72 లక్షల 79 వేల 362 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు.
ఇక రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 216, చిత్తూరులో 132 కేసులు, కృష్ణా జిల్లాలో 128 కేసులు నమోదు కాగా..కడప జిల్లాలో 111, గుంటూరులో 85, ప్రకాశం జిల్లాలో 117 కేసులు నమోదయ్యాయి.
Also read: NEET Exam 2021: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు ఏర్పాట్లు, నిషేధిత వస్తువుల జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook