AP Students in Ukraine: ఇక మరింత వేగంగా విద్యార్ధుల తరలింపు, పోలండ్, హంగేరీ దేశాలకు ఏపీ ప్రతినిధులు

AP Students in Ukraine: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క విద్యార్ధి క్షేమం కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధులు ఆ దేశాలకు చేరుకోనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2022, 04:03 PM IST
AP Students in Ukraine: ఇక మరింత వేగంగా విద్యార్ధుల తరలింపు, పోలండ్, హంగేరీ దేశాలకు ఏపీ ప్రతినిధులు

AP Students in Ukraine: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క విద్యార్ధి క్షేమం కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధులు ఆ దేశాలకు చేరుకోనున్నారు.

రష్యా -ఉక్రెయిన్ యుద్ధంకొనసాగుతోంది. ఉక్రెయిన్ దేశంలో భారీ సంఖ్యలో భారతీయ విద్యార్ధులు చిక్కుకుపోయారు. అక్కడి విద్యార్ధుల్ని క్షేమంగా రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ దేశ గగనతలాన్ని ఉక్రెయిన్ దేశం మూసివేయడంతో సరిహద్దు దేశాల్నించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా అక్కడి విద్యార్ధుల్ని తరలిస్తోంది. ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్ విమానాల ద్వారా భారతీయుల్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. 

అయితే ఉక్రెయిన్‌లో పరిస్థితులు దిగజారుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సంప్రదించాయి. ఇప్పటికే కర్ణాటక విద్యార్ధి నవీన్ ఉక్రెయిన్‌లో బాంబు దాడులకు బలయ్యాడు. దాంతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధుల తరలింపు ప్రక్రియపై మరింత దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్ధుల్ని క్షేమంగా రప్పించేందుకు అధికారుల బృందాన్ని నేరుగా ఆ దేశాలకు పంపించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం రుమేనియా, పోలండ్, హంగేరీ దేశాల్నించి భారతీయ విద్యార్ధుల్ని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలుగు విద్యార్ధుల తరలింపు ప్రక్రియ వేగవంతమయ్యేందుకు అధికారుల బృందాన్ని పోలండ్, హంగేరీ దేశాలకు పంపించనుంది ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ ప్రతినిధుల బృందం అక్కడుంటే..కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తెలుగు విద్యార్ధులందర్నీ సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకొచ్చేందుకు వీలు కలుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అక్కడున్న తెలుగు విద్యార్ధుల్ని మ్యాపింగ్ చేస్తూ..తరలించే ప్రక్రియ పూర్తి చేస్తోంది. కీవ్ నగరం నుంచి బయటికొచ్చిన విద్యార్ధులు రైళ్ల ద్వారా రుమేనియా, హంగేరీ, పోలండ్ దేశాల సరిహద్దులకు చేరుతున్నారు. 

ఏపీలోనూ, ఏపీ భవన్‌లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ద్వారా విద్యార్ధుల తరలింపును పర్యవేక్షించేకంటే నేరుగా ప్రతినిధుల బృందం అక్కడుంటే..తరలింపులో జాప్యముండదనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ఢిల్లీకు చేరుకున్న భారతీయ విద్యార్ధుల్లో తెలుగు విద్యార్ధులు 17 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు ఏపీకు చెందినవారు కాగా, 11 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. 

Also read: Andhra Pradesh: మోహన్‌బాబు, మా అధ్యక్షుడు విష్ణు పేరిట సాగుభూమి పట్టాలు.. వారు నిరుపేదలా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News