AP Curfew Guidelines: ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ, ఎవరెవరికి మినహాయింపు

AP Curfew Guidelines: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది, ఇతర నిబంధనల్ని ప్రభుత్వం జారీ చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2021, 10:19 AM IST
AP Curfew Guidelines: ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ, ఎవరెవరికి మినహాయింపు

AP Curfew Guidelines: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది, ఇతర నిబంధనల్ని ప్రభుత్వం జారీ చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కరోనా వైరస్ (Corona Virus) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం (Ap government) పగడ్బంధీ చర్యలు చేపడుతోంది. అత్యవసరాలకు సమయమిచ్చి మిగిలిన సమయాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయనుంది.రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తోంది. మే 18వ తేదీ వరకూ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల్నించి 12 గంటల వరకే దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఉంటుంది. మిగిలిన సమయంలో పూర్తిగా కర్ఫ్యూ (Ap Curfew)అమల్లో ఉంటుంది.

కర్ఫ్యూ నుంచి ఎవరికి మినహాయింపు (Exempted from Curfew)

ఆసుపత్రులు(Hospitals), డయాగ్నస్టిక్ ల్యాబ్స్, మెడికల్ షాప్స్, ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా, టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐసీ సర్వీసులు, పెట్రోల్ బంకులు(Petrol Bunks), ఎల్‌పీ‌జీ, సీఎన్జీ గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ , నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, కోల్డ్ స్టోరేజ్‌లతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పనులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయితీ రాజ్ సంస్థల్లో సిబ్బందికి డ్యూటీ పాస్‌తో అనుమతి ఉంటుంది. ఆరోగ్య సేవలు పొందేందుకు వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి ఉంటుంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వ్యక్తులకు టికెట్ తప్పనిసరిగా ఉండాలి. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రజా రవాణాను ఉదయం 6 గంటల్నించి 12 గంటల వరకే అనుమతిస్తారు. కర్ఫ్యూ లేని సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది.

Also read: AP Curfew: రాష్ట్రంలో జూ పార్క్‌లు మూసివేత, కర్ఫ్యూకు ఆమోదం తెలిపిన కేబినెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News