AP government allows 100% Occupancy in Movie Theatres from Today: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (andhra pradesh government) సినీ పరిశ్రమకు కాస్త ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో సినిమా థియేటర్ల (Movie Theatres) విషయంలో కొన్ని రోజులుగా పలు విషయాలపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు కూడా కొనసాగించారు.
ఏపీ థియేటర్లతో ఆక్యుపెన్సీ (occupancy) వంద శాతం పెంచడంతో సినీ ఇండస్ట్రీకి కాస్త ఊరట లభించింది. కొత్త సినిమాలు విడుదల చేస్తే.. సినిమా థియేటర్లతో (Movie Theatres) ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఆందోళన చెందిన సినీ ఇండస్ట్రీకి వారికి ఇది శుభవార్తే.
Also Read : Huzurabad bypolls candidates: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది పోటీ
కరోనా (corona) నేపథ్యంలో ఏపీలో ఇప్పటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే కొనసాగింది. అలాగే రాత్రి పూట కర్ఫ్యూ (curfew) కూడా అమలు ఉండడంతో సెకండ్ షో (second show) కు అనుమతులు ఉండేవి కావు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) కర్ఫ్యూ అమలు వేళలు తగ్గాయి. ఈ నెల 31వ తేదీ వరకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
ఏపీలో థియేటర్లలోని సీట్లలో ఒక దానిని వదిలి మరోక దానిలో కూర్చోవాలన్న షరతును ఏపీ ప్రభుత్వం తొలగించింది. కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లలో సగం సీట్ల భర్తీ మాత్రమే జరిగేది. తాజా ఉత్తర్వుల్లో ఈ నిబంధన తొలగించడంతో పూర్తి స్థాయిలో సీట్ల భర్తీకి అవకాశం లభించింది. ఏపీలో థియేటర్లలో ఫుల్ సీటింగ్‌లో ఇప్పుడు కూర్చొవచ్చు. అలాగే వివాహాలు, ఇతర కార్యక్రమాలకు 250 మందికి మించి హాజరుకాకూడదని ఏపీ ప్రభుత్వం (AP government) స్పష్టం చేసింది.
Also Read : KKR beats DC, IPL 2021: ఢిల్లీపై కోల్‌కతా విజయం..ఇక మిగిలింది CSK vs KKR final match
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook