AP Curfew Timings: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు, జులై 1 నుంచి అమలు

AP Curfew Timings: రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, కోవిడ్19 వ్యాక్సినేషన్‌పై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ఫలితాన్నివ్వడంతో కేసులు తగ్గుముఖం పట్టాయని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2021, 03:58 PM IST
AP Curfew Timings: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు, జులై 1 నుంచి అమలు

AP Curfew Timings: కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విధించిన కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, కోవిడ్19 వ్యాక్సినేషన్‌పై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాలో కర్ఫ్యూ వేళలు యథాతథంగా ఉండాలని నిర్ణయించారు.

ఏపీలో పలు జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ ఫలితాన్నివ్వడంతో కేసులు తగ్గుముఖం పట్టాయని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కరోనా పాజిటివిటీ తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌19 పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ నిబంధనలు సడలించినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు. జులై 1 నుంచి జులై 7 వరకు వారం రోజులపాటు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయి. 

Also Read: Corona Positive Cases: ఇండియాలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు, జూన్ నెలలో ఇదే తొలిసారి

అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు కొనసాగుతుంది. మరోవైపు ఏపీలో భారీ స్థాయిలో కోవిడ్19 (AP Corona Update) వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఒక్క రోజులో రికార్డు సంఖ్యలో కరోనా టీకాలు ఇచ్చారు.

Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News