AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం జగన్

Andhra Pradesh Formation Day: పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) సంక్షేమం, అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 08:39 AM IST
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం, గవర్నర్‌‌ల శుభాకాంక్షలు
  • నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు
 AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy And governor Biswabhusan Harichandan Wishes On Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) సంక్షేమం, అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. 

ఇక నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో (CM Camp Office) ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు ఏపీ అవతరణ వేడుకలు ( Andhra Pradesh Formation Day) జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు (Potti Sreeramulu) నివాళి అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు.

Also Read :T20 World Cup 2021: అది జరిగితే..టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి

గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ (Governor Biswabhusan Harichandan) శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను ఆంధ్రప్రదేశ్‌ కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉండి అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఏపీ ప్రభుత్వం.. (AP Government) అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఆ సంక్షేమఫలాలు అర్హులైన ప్రతి వ్యక్తికి అందేలా చూడాలని గవర్నర్​ కోరారు.

Also Read : Zycov D Vaccine: ఇండియాలో మరో వ్యాక్సిన్, ధర తగ్గించిన జైడస్ క్యాడిలా సంస్థ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News