YS JAGAN Review: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. దీనికోసం డెడ్‌లైన్ విధించారు.
కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాల్ని బలితీసుకుంది. ఎన్నో కుటుంబాల్ని రోడ్డున పడేసింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబపెద్దను కోల్పోయి దిక్కుతోచకుండా మారిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేదే కారుణ్య నియామకాల ప్రక్రియ. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు తక్షణం కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి కారుణ్య నియామకాల ప్రక్రియ(Mercy Recruitment)పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్ 19(Covid19)నియంత్రణ, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్ ఏర్పాటుపై జగన్ సమీక్షించారు.జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం ఉండాలని సూచించారు. వివిధ ఆసుపత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామక క్యాలెండర్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. అక్టోబర్ 20వ తేదీన పోస్టుల భర్తీకై నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. పోస్టుల భర్తీకు అక్టోబర్ 20 నోటిఫికేషన్ ఇచ్చి..డిసెంబర్ 10న నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. డీఎంఈలో పోస్టులకు సంబంధించి డిసెంబర్ 5 నాటికి నియామక ఉత్తర్వులు అందిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఏపీవీవీపీలో పోస్టుల భర్తీకు సంబంధించి అక్టోబర్ 20-23 మధ్య నోటిఫికేషన్ జారీ కానుంది. ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21-25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్(Ap cm ys jagan) ఆదేశించారు.
Also read: Tamilnadu: తమిళనాడులో మరో కొత్త పథకం, ఇంటి వద్దకే దంత వైద్య సేవలు, విద్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి