AP Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి..రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Ap Formation Day) మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంధ్రనాథ్, ఆదిమూలపు సురేష్, శంకరనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also read: AP State Formation Day: తెలుగులో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook