Andhra Pradesh: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం?

AP news: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించనట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 12:28 PM IST
Andhra Pradesh: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం?

Andhra Pradesh: రాజ్యసభకు (rajya sabha) అభ్యర్థుల ఎంపికపై మరికాసేపట్లో ఉత్కంఠ వీడనుంది. వైసీపీకు దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను సీఎం జగన్ (CM Jagan) పైనల్ చేసినట్లు సమాచారం. సుధీర్ఘ కసరత్తు అనంతరం ఇవాళ సాయంత్రంలోగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు జగన్. ఇదివరకే రాజ్యసభ సభ్యుడిగా పదవి కాలం ముగిసిన సీనియర్ నేత విజయసాయిరెడ్డిని (Vijaya Sai Reddy) మరోమారు పెద్దల సభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరో స్థానానికి సంబంధించి రెడ్డి సామాజికి వర్గానికి చెందిన న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు సీట్లను బీసీ సామాజిక వర్గానికి కేటాయించినట్లు సమాచారం. అయితే ఈ వర్గానికే చెందిన బీదమస్తాన్ రావును, బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసిట్లు సమాచారం. రేసులో కిల్లి కృపారాణి పేరు కూడా వినిపిస్తోంది. 

రాజ్యసభ సీట్ల భర్తీ కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఇచ్చారు. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి...అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. 

Also Read: Ravela resign: ఏపీ బీజేపీకి షాక్..రావెల కిషోర్‌బాబు రాజీనామా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News