AP: మహిళలు, చిన్నారుల రక్షణకై అభయం ప్రాజెక్టు ప్రారంభం

ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం మరో వినూత్న పథకం ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.  

Last Updated : Nov 23, 2020, 01:34 PM IST
  • కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభయం ప్రాజెక్టు ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • ఆటోలు, క్యాబ్ లలో ఐవోటీ బాక్సుల ఏర్పాటు
  • మహిళలు, చిన్నారుల రక్షణ కోసమే అభయం యాప్ ప్రాజెక్టు
AP: మహిళలు, చిన్నారుల రక్షణకై  అభయం ప్రాజెక్టు ప్రారంభం

ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం మరో వినూత్న పథకం ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వ( Central Government ) సహకారంతో అభయం ప్రాజెక్టు ( Abhayam project )ను ప్రారంభించింది. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) గుర్తు చేశారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కూడా మహిళల పేరు మీదే చేస్తామన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు  50 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మహిళలకు ఆర్ధిక, రాజకీయ స్వావలంబన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన జగన్..మహిళల రక్షణ, భద్రత విషయంలో రాజీ పడటం లేదన్నారు. 

రవాణా శాఖ ( Ap Transport Department ) ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని.. ఆటోలు, క్యాబ్‌లలో నిర్భయంగా ప్రయాణించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్‌లో అభయం యాప్ ( Abhayam app )‌ డివైజ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముందుగా వేయి వాహనాల్లో ఈ డివైస్ ఏర్పాటు చేయనున్నారు. ఏడాదిలో లక్ష వాహనాలకు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 138.48 కోట్లు కాగా..నిర్భయ పథకం కింద కేంద్రం 80 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 55.39 కోట్లుగా ఉంది. Also read: AP: మరో అల్ప పీడనం, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్ ఏర్పాటుండాలి. దశలవారీగా ఐవోటీ బాక్సుల్ని( IOT Boxes ) అమర్చుతారు. తొలిదశలో వేయి ఆటోల్లో ఈ పరికరాలుంటాయి. వచ్చే యేడాదికి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు ఏర్పాటు కానున్నాయి. ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణించేవారు అభయం యాప్ ఇన్ స్టాల్ చేసుకుని..వాహనంలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే..డ్రైవర్ ఫోటో, వాహనం వివరాలు మొబైల్ కు వచ్చేస్తాయి. ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది తలెత్తితే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాాహనం నెంబర్ పంపితే..జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలవుతుంది. స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణీకులు వాహనంలో ఉన్న ఐవోటీ పరికరం ప్యానిక్ బటన్ నొక్కితే చాలు..కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుతుంది. క్యాబ్ లేదా ఆటో వెంటనే ఆగిపోతుంది. సమీపంలోని పోలీసులు  పట్టుకుంటారు. 

ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్ లకు అమర్చిన తరువాత డ్రైవర్ల లైసెన్సులకు రేడియా ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు జారీ చేస్తారు. ఐవోటీ బాక్సుకు ఈ కార్డుల్ని స్వైప్ చేస్తేనే ఆటో లేదా కారు స్టార్ట్ అవుతుంది. Also read: AP: త్వరలో మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం

Trending News