AP Cabinet Meet: మార్చ్ 14 ఏపీ కేబినెట్ భేటీ..అసలు ఎజెండా

AP Cabinet Meet: ఏపీ మంత్రివర్గ సమావేశం ఖరారైంది. ఈ నెల 14న జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో కీలకాంశాలు ఎజెండాలో ఉండనున్నాయి. ముఖ్యంగా రెండు అశాలను కేబినెట్ ఆమోదించవచ్చనే చర్చల నేపధ్యంలో కేబినెట్ భేటీకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2023, 09:08 AM IST
AP Cabinet Meet: మార్చ్ 14 ఏపీ కేబినెట్ భేటీ..అసలు ఎజెండా

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. మూడు రాజధానుల అంశం, విశాఖ నుంచి పరిపాల విషయమై కీలకమైన రెండు అంశాలకు కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే ఈ నెల 14వ తేదీ కేబినెట్ భేటీ కీలకంగా మారుతోంది.

మరో ఏడాది వ్యవధిలో ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరోవైపు ఈ నెల 14వ తేదీన జరగనున్న ఏపీ కేబినెట్ భేటీ అత్యంత కీలకం కావచ్చని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. మూడు రాజధానుల అంశం, విశాఖలో పరిపాలన ఎప్పటి నుంచనే అంశాలపై కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 

మార్చ్ 14వ తేదీ నుంచే ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మార్చ్ 17న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చ్ 15వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించినా ఆ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఎన్నికల ఏడాదిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల బడ్జెట్‌గా ఉండేందుకు వీలుగా కొత్త సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్టు కన్పిస్తోంది. 

అన్నింటికంటే ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలపై కేబినెట్ భేటీలో స్పష్టత ఉండవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయమై ప్రకటన కూడా చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కీలకంగా మారనున్నాయి.

Also read: GIS 2023: అంతా సిద్ధం, గ్లోబల్ సమ్మిట్ ఎలా ఉంటుంది, ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News