Vaikunta Dwaram Flower Decoration: తిరుమల క్షేత్రంలో వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం పాలవగా అప్పటి నుంచి తిరుమల ఆలయ కార్యకలాపాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో వివాదం చెలరేగింది. ఓ దాత రూ.కోట్లు ఖర్చు చేసి అలంకరణ చేయగా వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఆ వివాదం ఇలా ఉంది.
Also Read: TTD Tickets: వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ కోటా టికెట్ల తేదీలు ఇవే!
తిరుమల ఆలయ అధికారుల తీరుపై ఆలయ అలంకరణకు విరాళం అందించిన కర్ణాటకకు చెందిన సునీత తిమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విరాళంగా స్వామివారి దశావతారాల విగ్రహాలను ఆలయ రంగ నాయకుల మండపంలో ఉంచకుండా బయటకు తెచ్చిపెట్టారని ఆరోపించారు. టీటీడీ అధికారులు ప్రాసెసింగ్ ఇచ్చి అన్ని అనుమతులు ఇచ్చారని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం శ్రీవారి ఆలయ అలంకరణ కోసం రెండో ఏడాది కూడా విరాళం ఇచ్చినట్లు వివరించారు.
Also Read: Tirumala News: శ్రీవారి సన్నిధిలో అపచారం.. ఆందోళనలో భక్తులు..!
ఆమె వాదన ఇలా
'ప్రతి దాతకు టీటీడీ మూడు రోజుల స్లాట్ కేటాయించింది. చివరి స్లాట్‌ను మాకు ఇవ్వడంతో 3 నెలల ముందే పక్కా ప్రణాళికగా అన్ని అనుమతులు తీసుకుని ఆలయ అలంకరణ చేయించాం. అయినా భక్తులు మనోభావాలు.. మా దైవభక్తిని టీటీడీ అవమానించింది' అని దాత సునీత తిమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను డబ్బులు సంపాదించాలని రాలేదు. శ్రీవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. ఐదు మంది డిజైనర్లు ఆలయ అలంకరణ కోసం కృషి చేశారు . రూ.15 లక్షలు వెచ్చించి వివిధ దేశాల నుంచి అనేక రకాల పుష్పాలను తెప్పించాం. రూ.25 లక్షలతో సంప్రదాయ పుష్పాలను తెప్పించి అలంకరించాం' అని వివరించారు.
తీరా డిజైన్ చేయించాక కొండపైన క్రేన్స్ రాకూడదు అంటూ చెప్పి చేయించిన డిజైన్‌ను చెరిపారని దాత సునీత తిమ్మ వాపోయారు. 'ఇది చిన్న విషయం కాదు. ఇది మనోభావాలకు సంబంధించిన విషయం. దేవుడికి వైకుంఠ ద్వార దర్శనాలలో స్వామి వారికి సేవ చేయాలని వచ్చాం. ఆగమ పండితులు కూడా బ్రహ్మాండంగా అలంకరించారని ప్రశంసించారు. ఇప్పుడు వచ్చి ఈ అలంకరణ చేయకూడదు. విరుద్ధం అని ఎలా అంటారు' అని ఆమె ప్రశ్నించారు. కోటి రూపాయలకుపైగా ఖర్చు పెట్టి చేయించినట్లుతెలిపారు. 'డబ్బుల కోసం మేము గొడవ పడడం లేదు. స్వామి వారిని అవమానించేలా మా మనోభావాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది' అని సంచలన ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.