కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కువ శాంపిల్స్ టెస్ట్ చేయడం అందుకు కారణమని చెబుతున్నారు. ఏపీలో గత 24 గంటల్లో 64977 శాంపిల్స్‌ని పరీక్షించగా 71 కేసులు కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరుకుంది. ప్రముఖ నటుడు రిషి కపూర్ కన్నుమూత
మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్స తర్వాత 321 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలను తాజాగా వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!
Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ
జిల్లాలవారీగా చూస్తే 346 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలులో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గుంటూరు 287, కృష్ణా 246 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజా కేసులలో కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదు కావడం గమనార్హం. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..