AP Corona cases: ఏపీలో టెస్టులు తగ్గినా.. భారీగా పెరిగిన కరోనా కేసులు!

AP Corona cases: ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా 13 వేలకుపైగా కేసులు నమదయ్యాయి. రికవరీలు తగ్గాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 06:35 PM IST
  • ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం
  • ఒక్క రోజులో 13 వేలపైకి కేసులు
  • క్రితం రోజుతో పోలిస్తే తగ్గిన టెస్టుల సంఖ్య
AP Corona cases: ఏపీలో టెస్టులు తగ్గినా.. భారీగా పెరిగిన కరోనా కేసులు!

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 13,212 మందికి కరోనా సోకినట్లు (Corona cases in AP) ఏపీ ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.

గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 44,416 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం. క్రితం రోజుతో పోలిస్తే శాంపిళ్లు భారీగా తగ్గనా..  కేసులు మాత్రం రికార్డు స్థాయిలో పెరగటం గమనార్హం.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,942 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,74,600 మంది కరోనాను జయించారు.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు తెలిపింది.

ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,532 మంది కొవిడ్​కు (Total Corna deaths in AP) బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 64,136 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

విశాఖపట్నంలో అత్యధికంగా 13,020 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది (Corona Active cases in Vizag) ఆరోగ్య విభాగం. ఆ తర్వాత చిత్తూరులో 10,446 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 1,137 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలలో మూడు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,20,56,618 శాంపిళ్లను పరీక్షించినట్లు (Corona tests in AP) తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,153,268  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

Also read: ఆడపిల్ల మానంకు 5 లక్షలు.. ప్రాణంకు 10 లక్షలు ఇస్తారేమో! ఏపీ సీఎంపై మండిపడ్డ వంగలపూడి అనిత!!

Also read: AP Cabinet: పీఆర్సీ సహా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News